సందీప్ రెడ్డి వంగ చరణ్ సాయంతో జాక్ పాట్ కొడతాడా?

అర్జున్ రెడ్డి… సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌లో క‌బీర్ సింగ్ టైటిల్‌తో రీమేక్ అయ్యింది. అక్క‌డ కూడా రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డంతో సందీప్ రెడ్డికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి టాలీవుడ్‌లో సినిమా చేస్తాడు అనుకుంటే… బాలీవుడ్‌లో భారీ ఆఫ‌ర్ రావ‌డంతో అక్క‌డే డెవిల్ పేరుతో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో రానుంది.

హిందీలో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ దగ్గర చిరుకి సరిపోయే కథ ఉందట. అది మెగాస్టార్‌కి చెప్పి ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడట. మెగాస్టార్‌తో సినిమా చేయ‌క‌పోయినా ఫ‌ర‌వాలేదు కనీసం క‌థ చెప్పినా చాలని సందీప్ రెడ్డి ఫీల్ అవుతున్నాడట. వరసగా సినిమాలని లూప్ లైన్ లో పెట్టిన చిరు, యంగ్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. చ‌ర‌ణ్ తో ఉన్న రిలేషన్ కారణంగా సందీప్‌ చిరుకి కథ చెప్పే వరకూ వెళ్లొచ్చు. ఆ తర్వాత చిరంజీవికి కథ నచ్చి ఆ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం సందీప్ రెడ్డి వంగ నిజంగా జాక్పాట్ కొట్టినట్లే.