పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” టీజర్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరి హర వీర మల్లు. ఈ సినిమా కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు వేచి చూస్తున్న ఈ తరుణంలో హరి హర వీరమల్లు టీజర్ అప్డేట్ మన ముందుకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కారణంగా ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా మేకర్స్ ఇటువంటి అప్డేట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ కు మరింత ప్లస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా నుండి రాబోతున్న ఈ టీజర్ లో డైలాగ్ ఎలా ఉండబోతోందో అనే మరో కుతూహలం కూడా ఉంది. కాహా మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు ‘ధర్మం కోసం యుద్ధం’ అనే కాప్షన్ తో హరి హర వీరమల్లు టీజర్ లాంచ్ కానున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.