“అల్లూరి సీతారామరాజు” కు 50 సంవత్సరాలు

అల్లూరి సీతారామరాజు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారు. అల్లూరి సీతారామరాజు గారు ఎంతో గొప్ప స్వతంత్ర పోరాటం చేసిన నాయకుడు, యోధుడు. అయితే ఆయన ఆరోజుల్లో మన దేశానికి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన విధానాన్ని వి రామచంద్రరావు గారు ఎంతో గొప్పగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజు అంటే నేటికీ సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తొచ్చే విధంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా ఆ రోజుల్లో 365 రోజులు థియేటర్ లో నడిచింది అంటేనే అర్ధం చేసుకోవచు ఆ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో. అయితే నేటికీ ఈ సినిమా సరిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1974 మే 1వ తేదీన మే డే రోజు ఈ సినిమా విడుదల జరిగింది. దేశ భక్తితో తీసిన ఈ సినిమా సినిమా ప్రేమికులనే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.