“నటరత్నాలు” మూవీ జెన్యూన్ రివ్యూ

సూపర్ స్టార్ కృష్ణ తో చేసిన ‘ఈ తరం నెహ్రూ’ తో దర్శకుడిగా మారిన శివనాగు ఒకే జోనర్ సినిమాలు చెయ్యకుండా విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ, యాక్షన్, క్రైం, కామెడీ, థ్రిల్లర్ సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీ లో ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు నర్రా శివనాగు. తాజాగా తను దర్శకత్వం వహించిన క్రైం కామెడీ థ్రిల్లర్ “నటరత్నాలు”. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని కలగనే యువత చాలామంది ఉన్నారు, ఆలా ఇండస్ట్రీకి వచ్చిన వారంతా ఏం చేస్తున్నారు, వారిలో ఎంతమంది సఫలమవుతున్నారు? ఎంతమంది విఫలమవుతున్నారు?అనే కథను సినిమాగా మీ ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు శివనాగు.చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ నటీనటులుగా నటించిన ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నటరత్నాలు’ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి .

కథ :
బంగార్రాజు (అర్జున్ తేజ్), వరప్రసాద్ (సుదర్శన్ రెడ్డి), పి.కె నాయుడు (రంగస్థలం మహేష్) లు ముగ్గురు హీరో, డైరెక్టర్, కెమెరామెన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి గత ఆరు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే వరప్రసాద్ కు మాత్రం ప్రముఖ దర్శకుడు ఏ. ఎస్ రవికుమార్ చౌదరి చేయబోయే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే అవకాశం వస్తుంది. దాంతో నేను జాయిన్ అయిన తరువాత మీకు అవకాశం వచ్చేలా చూస్తాను అంటాడు. పూర్ గర్ల్ అయిన సువర్ణ (ఇనయ సుల్తానా) హీరోయిన్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసిన తరువాత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తుంది. ఈ షూటింగ్ లొకేషన్ కు వచ్చిన బంగార్రాజు కు హీరోయిన్ సువర్ణతో పరిచయం ఏర్పడుతుంది.ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.అయితే వరప్రసాద్ చేసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడంతో నిర్మాత చంటి నిర్మిస్తున్న నటరత్న సినిమాలో డైరెక్టర్ గా వరప్రసాద్, హీరోగా బంగార్రాజు కు , హీరోయిన్ గా సువర్ణ, కెమెరామెన్ గా పి.కె. నాయుడు లకు అవకాశం వస్తుంది.ఈ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్న వీరు ముగ్గురు అనూహ్యంగా ఓ మర్డర్ కేస్ లో చిక్కుకుంటారు.అసలు వీరు ఈ మర్డర్ కేసులో చిక్కుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈ కేస్ నుండి వీరు ముగ్గురు ఎలా బయట పడ్డారు? చివరికి వారి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారా లేదా? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “నటరత్నాలు” సినిమా చూడాల్సిందే…

నటన :
బంగార్రాజు (అర్జున్ తేజ్) పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొత్త వాడైనా చాలా చక్కగా నటించారు. అతనికి జోడీగా నటించిన సువర్ణ (ఇనయ సుల్తానా) అటు గ్లామర్ గా…ఇటు పర్ ఫార్మెన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. రాజమౌళి అంతటి దర్శకుడు అవ్వాలని తపనపడే పాత్రలో వరప్రసాద్ గా(సుదర్శన్ రెడ్డి), చోటా కె. నాయుడు అంత గొప్ప కెమెరామెన్ అవ్వాలని తాపత్రయపడే పాత్రలో పి. కె నాయుడు గా (రంగస్థలం మహేష్) లు వీరిద్దరూ చాలా చక్కగా నటించి మెప్పించారు. ఎన్నో సినిమాలు చేసిన దర్శకుడు ఏ. ఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాలో దర్శకుడుగా ఫుల్ లెన్త్ రోల్ లో నటించి మెప్పించాడు.. టైగర్ శేషాద్రి కొత్తవాడైనా విలన్ గా నటించి మెప్పించాడు. సి. ఐ క్యారెక్టర్ లో నటించిన సూర్య కిరణ్ నటన ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు, పోలీస్ క్యారెక్టర్ లో అర్చన, నిర్మాత పాత్రలో నటించిన చంటి కమెడియన్స్ తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, సెకెండ్ హీరోయిన్ గా నటించిన శైలు, హీరోయిన్ కావాలని తపన పడే పరిమళ తదితరులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక విశ్లేషణ :
సినిమా ఇండస్ట్రీ అనేది మహా సముద్రం. ఈ మహా సముద్రంలో ఈదడం అంటే చాలా కష్టం. సినిమా జర్నీ అంటే ఎలా ఉంటుంది. దాని ఆదిగమించాలి అంటే ఎలా కష్టపడాలి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారందరికీ ఈ సినిమా చాలా ఉపయోగ పడుతుందని చెప్పచ్చు .. సినిమాలో సినిమా ఎలా ఉంటుందనే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని…దాని చుట్టూ ఆసక్తికరమైన కథ… కథనం, స్క్రీన్ ప్లే తో పాటు…ఇందులో లవ్, కామెడీ, యాక్షన్, చక్కటి ఏమోషన్స్ వంటి అన్ని అంశాలతో తీసిన ఈ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగేలా చాలా చక్కగా తెరకెక్కించడంలో దర్శకుడు శివనాగు పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. పరిశ్రమకి వచ్చి ఎదో సాదించాలనే కలలతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి కథలు ఇందులో ఉంటాయి. మంచి విజయాలను అందించిన దర్శకులు సూర్య కిరణ్, ఎ.ఎస్ రవికుమార్ చౌదరి ఇందులో కీలక పాత్రలు పోషించారు..సంగీత దర్శకుడు శంకర్ మహదేవ్ అందించిన సంగీతం బాగుంది.ఫుల్ బాటల్ ఎటులేదు పెగ్గాయినా కొట్టు బ్రదర్, కలలు కలలు ఎటు చూసినా కలర్స్సే, నీ పుట్టింది అమలాపురం నే పెరిగింది ఇచ్చాపురం వంటి పాటలు బాగున్నాయి. వచ్చి ఆరేళ్లు అయినా ఒక్క సినిమా చెయ్యలేకపోయానని సుదర్శన్ చెప్పే డైలాగ్ సినిమా కష్టాలను చాటి చెబుతుంది.సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమా తోనే ప్రాణం వదులుతాను., అలాగే రాజమౌళి, శంకర్, ప్రశాంత్ నీల్, టీం వర్క్ తోనే సక్సెస్ అయ్యారనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గిరి కుమార్ అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ పనితీరు బాగుంది. చందన ప్రొడక్షన్స్ మరియు ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాతలు చంటి యలమాటి, డాక్టర్ దివ్య ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైం,కామెడీ థ్రిల్లర్, మిస్టరీ సినిమాలు ఇష్టపడే వారందరికీ “నటరత్నాలు” సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పచ్చు.