దీక్షిత్ శెట్టి తెలుగు- కన్నడ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ క్రేజీ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ ట్యాలెంటెడ్ దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో తెలుగు- కన్నడ బైలింగ్వల్ గా ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. బృందా ఆచార్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ దేవి ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యానర్ పై హెచ్ కె  ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ అనే క్యాచి టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో దీక్షిత్ శెట్టి గన్ షూట్ చేస్తూ, కాలికి టైగర్ మాస్క్ పెట్టుకొని కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై చాలా క్యురియాసిటీని పెంచింది. మే 25న ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

నటీనటులు: దీక్షిత్ శెట్టి, బృందా ఆచార్య
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అభిషేక్ ఎమ్
నిర్మాత : హెచ్ కె  ప్రకాష్
బ్యానర్ :  శ్రీ దేవి ఎంట‌ర్‌టైన‌ర్స్
సంగీతం: జుధాన్ శ్యాండీ
డీవోపీ: అభిషేక్ జే
ఎడిటర్: తేజస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: రఘు మైసూర్
పీఆర్వో: వంశీ శేఖర్