ఆనంద్ నా గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేసి…. : విజయ్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ లో ప్రగతి శ్రీవాస్తవ తో జంటగా నటిస్తూ వస్తున్న సినిమా గేమ్ గేమ్ గణేశా . దర్శకుడు ఉదయ్ శెట్టి ని దర్శకుడుగా ఈ చిత్రం తో పరిచయం కానున్నారు. హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న్నారు. కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అనంతరం మీడియా తో సమావేశమైన ఈ సినిమా టీం మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సంవాదం ఇవ్వడం జరిగింది.

మీడియా తో మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన నయన్ సారిక ఆనంద్ దేవరకొండ ఫామిలీ ని రౌడీ ఫామిలీ అన్నారు. అలా ఎందుకు అన్నారు అని ఓ రిపోర్టర్ అడగగా తాను వేరే ఉద్దేశంతో ఆలా అనలేదు అని, ఒక మంచి ఫామిలీ అని, ఆనంద్ దేవరకొండ ను రోడీ బాయ్ అంటారు కాబట్టి రౌడీ ఫామిలీ అన్నాను అని వివరించారు.

ఇది ఇలా ఉండగా ఒక రిపోర్టర్ ఆనంద్ దేవరకొండ ను మీరు మీ అన్నయ విజయ్ దేవరకొండ లా ఎందుకు మాట్లాడతారు? మీ అన్నయ్య వాయిస్ ల ఉంటుంది కదా, ఎందుకు ఆలా మీ అన్నయ్య ను అంతగా కాపీ చేస్తారు అని అడగగా ఆనంద్ ఆ విషయంకై మా అన్న ని అడగాలి అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆనంద్ దేవరకొండ మీడియా సమావేశంలోనే తన అన్న విజయ్ దేవరకొండకు ఫోన్ కాల్ చేయగా విజయ్ దేవరకొండ ఇలా అన్నారు… అవును నాది, నా తమ్ముడిది గొంతు ఒకేలా ఉంటుంది. ఆ విష్యం మేము మా చిన్న తనంలోనే గమనించాం. మా ఇంట్లో మా అమ్మ గారు కూడా ఒకొక్కసారి కన్ఫ్యూస్ అవుతారు మేము పిలిచినప్పుడు. అంతే కాకుండా నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో అండ్ నాకు వచ్చే కాల్స్ లో నాకులా మాట్లాడేవాడు, అలాగే నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే నేనే అన్నట్లు మాట్లాడి ప్రాంక్ చేసేవాడు. ఆలా చాలా సార్లు జరిగింది అన్నారు.