“ప్రేమికుడు” రీ-రిలీజ్ పోస్టుపోన్

మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మరియు శోభారాణి గారు పాల్గొన్నారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300 కు పైగా థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవబోతుంది అని రీసెంట్ గా విడుదల చేశారు. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సర్రిగా ఇదే తరుణంలో నిర్మాతల నుండి మరో అప్డేట్ వచ్చింది. కొన్ని సాంకేతిక అంతారాయం వలన ఈ సినిమాని మే 1న కాకుండా మే నెల చివరి వారంలో విడుదల చేస్తున్నాట్లు చెప్పారు.

ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

నటీనటులు : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, గిరీష్ కర్నాడ్, వడివేలు, రఘువరన్ తదితరులు.

టెక్నీషియన్స్ :
నిర్మాణం : జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్
నిర్మాతలు : మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్
మ్యూజిక్ : ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్
దర్శకుడు : సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్
వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ : మురళీధర్ రెడ్డి, రమణ
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ : సి ఎం ఆర్ ప్రొడక్షన్స్
పి ఆర్ ఓ : మధు VR