అలా చేసిన ఒకే ఒక్క స్టార్ హీరో మహేశ్ బాబు మాత్రమే…

టాలీవుడ్ లో సినిమాలతో పాటు, బ్రాండింగ్ లో కూడా బిజీగా ఉన్న స్టార్ హీరోస్ లో మహేశ్ బాబు ముందుంటాడు. ఏ హీరో చేయనన్ని బ్రాండ్స్ కి ప్రమోటర్ గా ఉన్న మహేశ్, మొదటిసారి కుటుంబంతో కలిసి ఒక యాడ్ చేశాడు. సాయి సూర్య డెవెలపర్స్ కోసం యమునా కిషోర్ షూట్ చేసిన ఈ యాడ్ లో మహేశ్ తో పాటు నమ్రత, గౌతమ్, సితారలు కూడా యాక్ట్ చేయడం విశేషం. ఘట్టమనేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన మొదటి షూట్ ఇదేనేమో. సాయి సూర్య డెవలపర్స్ యాడ్ ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేసిన మహేశ్ బాబు ఒక ట్వీట్ చేశాడు. కుంటుంబంతో సహా ఒక యాడ్ చేయడం మహేశ్ కి మాత్రమే సాధ్యం అయ్యింది.