పెళ్లిపీటలెక్కబోతున్న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. జనవరి 24న తన చిన్ననాటి స్నేహితురాలైన నటాషా దలాల్‌ను అతడు పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్‌లో ఉండగా.. గత ఏడాదిలోనే పెళ్లి జరగాల్సి ఉంది. కానీ అంతలోపు లాక్‌డౌన్ రావడంతో ఆగిపోయింది. ఇప్పుడు జనవరి 24న ముంబైలోని అలీబాగ్‌లో వరుణ్, నటాషా పెళ్లి జరగబోతుంది.

varun dhavan marriage date

దీని కోసం వరుణ్ తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కొద్దిమంది మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు. కేవలం 40 నుంచి 50 మంది మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ హాజరవుతున్నాడని తెలుస్తుంది.