” రోబరి ” మూవీ ట్రైలర్ లాంచ్ !!

సుదర్శన్ మూవీ మేకర్స్ పతాకంపై యస్.యన్. నాయుడు, యస్.ఏ.నరసమ్మ సమర్పణలో యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా, యస్.సుధీర్ సహనిర్మాతగా అభిషిక్త్, సమ్మోహన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ రోబరి ‘. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో జరిగింది.


ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ ట్రైలర్ బాగుంది. ఈ చిత్రం విజయం సాధించి దర్శక నిర్మాతలకు, హీరో హీరోయిన్ కు మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’ అన్నారు.


మరో అతిథి ఏ.పి.ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ‘ ఎన్నో సంవత్సరాలుగా సినిమాను నమ్ముకొని వున్న వ్యక్తి శ్రీనివాస్ అని, ఈ సినిమా విజయంతో అతని చిరకాల కోరిక నెరవేరి మరెన్నో చిత్రాలను నిర్మించాలని కోరారు.


దర్శక నిర్మాత యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ నా అభిమాన హీరో శ్రీకాంత్ గారి చేతులమీదుగా నా రోబరి సినిమా ట్రైలర్ లాంచ్ జరగడం నా అదృష్టమని, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీమిత్ర చౌదరి గార్కి, మోహన్ గౌడ్ గార్కి నేను ఋణపడి వుంటానని, శ్రీకాంత్ గారిది లక్కీ హ్యాండని, ఆ లక్కీ మాకు కూడా కలిసివస్తుందని ఆశిస్తున్నామని’ తెలిపారు.


హీరో అభిషిక్త్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెచ్చి పెడుతుందని, దర్శక నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడా రాజీ పడకుండా మాతో నటింపజేశాడని’ తెలిపారు.


ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర చౌదరి, నారాయణరావు, పెరుగు వెంకటేష్, మిత్తాని ఈశ్వర్, రాయిపాటి నాగేశ్వర్, దొరబాబు, మణికంఠ పాల్గోన్నారు.
యస్.శ్రీనివాస్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, ఫైట్స్: మల్లేశ్ – దేవరాజ్, డైలాగ్స్: నండూరి వీరేశ్, కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: అనిల్ కుమార్.