ప్ర‌భాస్‌-య‌శ్ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రావాలంట‌..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, రాకింగ్‌స్టార్ య‌శ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్స్ ఇద్ద‌రూ క‌లిసి ఒకేవేదిక‌పై క‌నిపించి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా స‌లార్ చిత్రం తెర‌కెక్కిస్తుండ‌గా.. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగందూర్ నిర్మించ‌నున్న ఈ సినిమాను శుక్ర‌వారం పూజా కార్య‌క్రమాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు.

prabhas yash multistarer

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హీరో య‌శ్‌, క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం, దిల్ రాజు, డీవీవీ దాన‌య్య‌లు హాజ‌ర‌య్యారు. ఈ స‌లార్ ప్రారంభోత్స‌వంలో ప్ర‌భాస్‌, య‌శ్ ఇద్ద‌రు మీడియాకు పోజులిచ్చిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా.. దీంతో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూప‌ర్‌స్టార్స్ క‌నిపించ‌డంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతూ.. ఇద్ద‌రు క‌లిసి ఓ భారీ యాక్ష‌న్‌ మ‌ల్టీస్టార‌ర్ చేస్తే బాగుంటుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రోవైపు య‌శ్ న‌టించిన కేజీఎఫ్‌-2 చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది.