గమనం సినిమాలో సింగర్ గా నిత్యా మీనన్

సెలెక్టివ్ కథలతో సినిమాలు చేసే కేరళ కుట్టి నిత్యా మీనన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గమనం. సుజనా రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిత్య సింగర్ శైలపుత్రిగా నటిస్తోంది. ఈ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని హీరో శర్వానంద్ రిలీజ్ చేశాడు. మైక్ ముందు కూర్చోని పాట పడుతున్న నిత్య మీనన్ చీరలో చాలా అందంగా ఉంది.

తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ కూడా నటిస్తోంది. ఇటీవలే ఆమె పుట్టిన రోజున చిత్ర యూనిట్ శ్రియ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మంచి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. రియల్ లైఫ్ డ్రామాగా రూపొందిన గమనం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.