తెలుగు నిర్మాతకి చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

సెక్సీ బాంబ్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా బ్లాక్ రోజ్. డైరెక్టర్ సంపత్ నంది నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లి హైదరాబాద్ పరిసరాల్లో పది రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. షెడ్యూల్ గ్యాప్ లో ముంబై వెళ్లిన ఊర్వశి, అక్కడికి చేరుకోగానే అడ్డమైన కండీషన్స్ పెడుతూ నిర్మాతకి చుక్కలు చూపిస్తోందట.

త్వరలో బ్లాక్ రోజ్ షూటింగ్ మళ్లీ మొదలవ్వాల్సి ఉండగా, ఊర్వశి తనకి నోవాటెల్ హోటల్ లోనే రూమ్ కావాలని, లొకేషన్ కి వెళ్ళడానికి లక్జరి బెంజ్ కావాలని గొంతెమ్మ కోరికలు అడుగుతుందట. కోవిడ్ కారణంగా కష్టాల్లో ఉన్న నిర్మాతలకి అండగా నిలవాల్సింది పోయి, అవేమి పట్టించుకోండి ఊర్వశి ఇలా అడగడం ఏంటో ఆమెకే తెలియాలి కానీ ఇలానే చేస్తే మాత్రం తెలుగులో ఊర్వశి ఎక్కువ రోజుల కెరీర్ కొనసాగించ లేకపోవచ్చు.