బిగ్‌బాస్‌-4 బ్యూటీ మోనాల్ త్వ‌ర‌లో ఇంటామె అవుతుందట..‌

మోనాల్‌గ‌జ్జ‌ర్ బిగ్‌బాస్‌-4 తెలుగు కంటెస్టెంట్‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మే. మోనాల్ సుడిగాడు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైనా.. ప‌లు సినిమాల్లో న‌టించినా రాని క్రేజ్ అంతా బిగ్‌బాస్ షోతో వ‌చ్చేసింది. అందుకే ఆ క్రేజ్‌ను పూర్తిగా వాడుకోవాల‌ని డిసైడ్ అయిపోయిందట‌. దీప‌ముండ‌గానే ఇళ్లు చ‌క్క‌దిద్దుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే తాజాగా మోనాల్ ఇంటావిడా కాబోతుంది. బిగ్‌బాస్‌లో ఏడ్వ‌డం, రొమాన్స్ త‌ప్ప ఏమి లేదు.. మ‌రోవైపు కంటెస్టెంట్ అఖిల్ కూడా మోనాల్ అంటూ ఆమె చుట్టూ తిర‌గ‌డం ఇలా ఈ రొమాంటిక్ యాంగిల్‌, ఆమె గ్లామ‌ర్‌తో మోనాల్‌కు క‌లిసి వ‌చ్చిందనే చెప్పాలి.

monal buy house hyderabad

కానీ బిగ్‌బాస్‌లో ఏమి చేసినా ఫైన‌ల్ వ‌ర‌కు రాలేక‌పోయింది ఈ గుజ‌రాతీ భామ. ఇక బిగ్‌బాస్‌తో పాపులారిటీ వ‌చ్చిన మోనాల్‌కు బాగానే సినీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. దీంతో హైద‌రాబాద్‌లో ఓ ప్లాట్ తీసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. అంతేకాదు ఇప్ప‌టికే ఓ ప్లాట్ తీసుకుని త్వ‌ర‌లోనే గృహ ప్ర‌వేశం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇంకేముంది పెళ్లికి ముందే గృహ ప్ర‌వేశం చేయ‌డంతో త్వ‌ర‌లోనే ఇంటావిడా కాబోతుంద‌ని మోనాల్ స‌న్నిహితులు అనుకుంటున్నార‌‌ట.‌