BIG BREAKING: ‘క్రాక్’ సినిమా విడుదలకు బ్రేక్.. షోలు రద్దు

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల క్రాక్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. దీంతో ఇవాళ మార్నింగ్ థియేటర్లకు వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు తమకు ఇవ్వాల్సిన బకాయిలను క్లియర్ చేయకపోవడంతో.. స్క్రీన్ సీన్ మీడియా కోర్టును ఆశ్రయించింది.

krack morning show cancel

ఈ క్రమంలో మార్నింగ్ షోలను రద్దు చేయాలని క్రాక్ మేకర్స్ నిర్ణయించారు. ఈ రోజు మార్నింగ్ షోలను రద్దు చేయగా.. మధ్యాహ్నం షోలను కూడా రద్దు చేసే అవకాశముంది. ఆన్‌లైన్‌లో కూడా మార్నింగ్ షో టికెట్లు బుక్ అవ్వడం లేదు. ఇప్పటికే బుక్ చేసుకున్నవారిని డబ్బులు రీఫండ్ ఇస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ పవర్‌పుల్ పోలీస్ పాత్రలో నటించగా.. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది.