క్రాక్ చిత్రంలో విల‌న్ పాత్ర ఇలా ఉండ‌బోతుందా‌..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం క్రాక్‌. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాధికారిగా న‌టించ‌ర‌నే విష‌యం ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాలో ర‌వితేజ పాత్ర ప‌క్క‌నే పెడితే.. ఇందులో ప్ర‌ధాన విల‌న్ పాత్రలో త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని పోషించ‌గా.. ఈ విల‌న్‌పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ ఓ థీమ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు చిత్ర‌బృందం. దీంట్లో క్రూర‌మైన క‌టారి కృష్ణ పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని న‌టించాడనే విష‌యం ఈ సాంగ్ చూస్తే తెలుస్తుంది. అత్యంత‌ క్రూర‌మైన‌వాడిగా, క‌టారి కృష్ణ‌గా స‌ముద్ర‌ఖ‌ని ఒదిగిపోయాడ‌ని అనిపిస్తుంది. ఈ థీమ్ సాంగ్‌ లిరిక్స్ గ‌మ‌నిస్తే ఏ రేంజ్‌లో రామ‌జోగ‌య్య‌శాస్త్రి ఎలివేట్ చేసాడో చూడోచ్చు.

krack movie villen character

ఇక ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించ‌గా.. ఈ థీమ్ సాంగ్‌తో క‌టారి కృష్ణ క్యారెక్ట‌ర్ ఇతివృత్తాన్ని బ‌య‌ట‌పెడుతోంది. ఇలా నిజంగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని చెప్పిన విధంగా.. ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌తో పాటు మిగ‌తా పాత్ర‌లు నిజ జీవితంలో ఎదురుప‌డిన క్యారెక్ట‌ర్ల నుంచి రూపొందించామని చెప్పుకొచ్చాడు. ఇక క్రాక్ చిత్రం రేపు విడుద‌ల‌వుతుండ‌గా.. హీరోయిన్‌గా శ్రుతిహాస‌న్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది.