Keerthi Suresh Family: నా బ‌రువు చూసి అంద‌రూ ఎగ‌తాళి చేసేవారు: కీర్తిసురేశ్ సోద‌రి

Keerthi Suresh Family: ప్ర‌ముఖ న‌టి కీర్తి సురేశ్ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. ఈ న‌టి అమ్మ‌గారు కూడా న‌టి అని మాత్రం కొంత‌మందికి తెలుసు.. ఆమెనే అల‌నాటి తార మేన‌క‌.. ఈమె తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో న‌టించి సినీ ప్రేక్ష‌కుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె పెద్ద‌కూతురు రేవ‌తి కాగా, రెండో కూతురు కీర్తి సురేశ్ సినీ ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Keerthi Suresh Familyఇక రేవ‌తి గురించి తెలుసుకుంటే.. తాజాగా త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. తాను శ‌రీర బ‌రువు కార‌ణంగా ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి నేను మాన‌సికంగా పోరాటం చేశాను.

keerthi suresh family

అందం, శ‌రీరాకృతి విష‌యంలో త‌న అమ్మ‌, సోద‌రితో పోలుస్తూ ఎంతోమంది న‌న్ను ఎగ‌తాళి చేసేవాళ్లు. బ‌రువు కార‌ణంగా ఇంట‌ర్ చ‌దువుతున్న రోజుల్లో చాలా అభ‌ద్ర‌తాభావానికి గుర‌య్యాను. అమ్మ‌, చెల్లిలా అందంగా లేన‌ని నాలో నేను న‌చ్చ‌జేప్పుకునేదాన్ని.. నాకేమైనా ఆనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా అని ఆలోచించేదాన్ని. ఒకానొక స‌మ‌యంలో నా భ‌ర్త నాకు ప్ర‌పోజ్ చేయ‌గానే.. అస‌లు నాలో ఏం చూసి ప్రేమిస్తున్నాడో ఇత‌ను అని షాక్ అయ్యాను. అలాగే ఒక‌రోజు ఓ పెద్దావిడ న‌న్ను మీ అమ్మ‌, చెల్లి అందంగా ఉంటారు నీకు ఏమైంది అని అడిగాక‌.. నాకెంతో బాధ అనిపించింది. చివరికి యోగాతో నేను బ‌రువు త‌గ్గాను. యోగా వ‌ల్ల నాలో ఉన్నా బ‌లాన్ని తెలుసుకోగ‌లిగాను.. ఈ జీవిత ప్ర‌యాణంలో Keerthi Suresh Familyఅమ్మ‌, కీర్తి న‌న్ను ప్రోత్సాహిస్తూనే ఉన్నారు అని రేవతి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంచితే కీర్తి సురేశ్ ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కార్‌వారి‌పాట‌లో హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమా కోసం కీర్తి బ‌రువు పెరిగింది.‌