Nidhi: నిధి అగ‌ర్వాల్‌కు గుడి కట్టిన ఫ్యాన్స్‌.. హీరోయిన్ రెస్పాన్స్‌!

Nidhi: ప్ర‌ముఖ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్.. స‌వ్య‌సాచి సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ప్రేక్ష‌కుల్లో గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత అఖిల్ అక్కినేని మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రంలో న‌టించింది.. ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌కున్నా ఈ అమ్మ‌డుకు పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో అవ‌కాశం ద‌క్కింది. ఈ చిత్రంలో నిధి త‌న అందాల‌తో కుర్ర‌కారును పిచ్చేక్కించింది. Nidhiఇస్మార్ట్ భామ‌గా సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ భామ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్ భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో న‌టించి అక్క‌డ కూడా ప్రేక్ష‌కుల మ‌దిలో స్థానం సంపాదించుకుంది.

nidhi temple

అలాగే సినిమాల‌తో పాటు హాట్ హాట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసేది Nidhiఈ అమ్మ‌డు. ఇక తాజాగా ఈ Nidhiఅమ్మ‌డుకు త‌మిళ‌నాడులో ఏకంగా గుడి క‌ట్టేశారు. గ‌తంలో ఖుష్భు, న‌గ్మా, న‌మిత‌, హ‌న్సిక వంటి హీరోయిన్ల విగ్ర‌హాల‌ను త‌మిళులు క‌ట్టారు. తాజాగా ఈ యువ న‌టి నిధి అగ‌ర్వాల్‌కు విగ్రహం ఏర్పాటు చేశారు. త‌మిళంలో నిధి అగ‌ర్వాల్ రెండు సినిమాల్లో న‌టించింది.. భూమి, ఈశ్వ‌ర‌న్ చిత్రాల్లో న‌టించి త‌మిళ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుందిNidhi. దీంతో ఆమెకు విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా పూజ‌లు చేసి హార‌తులు ఇచ్చారు. అలాగే పాలాభిషేకాలు కూడా నిర్వ‌హించి, కేకులు క‌ట్ చేసి ఆమెపై త‌మ ప్రేమ‌ను చాటుకున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ విష‌యంపై Nidhiనిధి అగ‌ర్వాల్ స్పందించింది.. త‌న‌పై ఇంత ప్రేమ‌ను చూపిస్తార‌ని అస‌లు ఊహించ‌లేద‌ని ఆమె తెలిపింది. త‌న ఫ్యాన్స్ త‌న‌పై చూపించిన స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని ఆమె తెలిపింది. అలాగే త‌న కోసం నిర్మించిన గుడిని చ‌దువు, ఆహారం, నిర్వాసితుల‌కు షెల్ట‌ర్ కోసం వినియోగించాల‌ని అభిమానులను కోరింది నిధి. ఇక Nidhiనిధి ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌- క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.