బోల్డ్ వెబ్ సిరీస్ కోసం సిద్దమవుతున్న కాజల్ అగర్వాల్

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ వయసు ఎక్కువవుతున్న కొద్దీ అభిమానుల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. ఇక పెళ్లికి చేసుకుందామని అనుకున్న సమయానికి అమ్మడికి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయి. అందుకే కొన్నాళ్ళు పెళ్లి విషయాన్ని పక్కనపెట్టాలని అనుకుంటోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే కాజల్ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక బోల్డ్ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ టివి సిరిస్ క్వాంటికోను త్వరలోనే రీమేక్ చేయనున్నారు. అయితే ఆ సిరీస్ హాట్ సీన్స్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. అందులో ప్రియాంక చోప్రా చేసిన పాత్రల్లోనే కాజల్ నటించనున్నట్లు టాక్. ఇక నెట్ ఫ్లిక్స్ నిర్మించనున్న ఆ సిరీస్ కోసం చందమామ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆడియెన్స్ కాజల్ క్యారెక్టర్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.