ఎట్ట‌కేల‌కు థియేట‌ర్లో రిలీజ్ అవుతున్న యాంక‌ర్ ప్ర‌దీప్ మూవీ!

యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా. ఈసినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఇప్ప‌‌టివ‌ర‌కు ప్ర‌దీప్ త‌న మాట‌ల‌తో బుల్లితెర‌పై న‌వ్వులు పూయిస్తూ.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యాంక‌ర్ ప్ర‌దీప్. అయితే ప్ర‌దీప్ మాచిరాజు తొలిసారి హీరోగా ప‌రిచ‌మ‌య‌వుతున్న 30రోజులు ప్రేమించ‌డం ఎలా చిత్రాన్ని గ‌తేడాదే విడుద‌ల చేయాల‌నుకున్న క‌రోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. ఇందులో ప్ర‌దీప్‌కు జోడీగా అమృతా అయ్యార్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట 200మిలియ‌న్ వ్యూస్‌ల‌కు పైగా యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌గా..

pradeep machiraju

ఈ సినిమాతో మున్నా అనే డైరెక్ట‌ర్ టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడు. ఈ సినిమా ఆమ‌ధ్యే ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న.. థియేట‌ర్స్ ఓపెన్ అయ్యేస‌రికి నిర్ణ‌యం మార్చేసుకున్నారు. ఇక ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు డేట్‌ను ఖ‌రారు చేశారు చిత్ర‌బృందం. జ‌న‌వ‌రి 29న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లపై ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా తెరెకెక్కుతున్న ఈ సినిమా భారీ విజ‌య‌వంతం కావాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.