క్యాబ్ డ్రైవర్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ క్యాబ్ డ్రైవర్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ అంటే నిజంగానే కారు డ్రైవర్‌గా మారిందేమోనని అనుకుంటున్నారా?.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. డ్రైవర్‌గా మారింది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. ఒక సినిమాలో క్యాబ్ డ్రైవర్‌గా ఐశ్వర్య రాజేష్ పనిచేయనుందట. తమిళంలో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. అక్కడ 25 సినిమాలు చేసింది.

aishwarya rajesh cab driver

ఇక మిచ్ మ్యాచ్ అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వతా వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో పాటు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో జమున అనే లేడీ ఓరియెంటెండ్ సినిమాకు ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో క్యాబ్ డ్రైవర్‌గా ఆమె నటించనుంది.