BIG BREAKING: తండ్రయిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు తల్లితండ్రులయ్యారు. అనుష్క శర్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించాడు. తన భార్య అనుష్క శర్మ ఆడబిడ్డకు జన్మనిచ్చిందని విరాట్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తమపై అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపిన కోహ్లీ.. ఈ సందర్భంగా తన ప్రైవసీని గౌరవించాలని కోరాడు.

అనుష్క శర్మ డెలివరీ కోసం ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాలోని వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల అనుష్క శర్మను కోహ్లీ హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. గత ఆగస్టులో అనుష్క శర్మ గర్భవతి అయింది.