గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శంషాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని పర్యావరణంలో వస్తున్న మార్పులను అరికట్టాలి అంటే మన అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని నీను ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది అని వాటిని తప్పకుండా సంరక్షిస్తా అని తెలిపారు నేను ఈ చాలెంజ్ కొనసాగించడం కోసం మరొక ముగ్గురికి  దర్శకుడు వేణు ఉడుగుల  ; నిర్మాతలు మైత్రి రవి; కిషోర్ గరికపాటి  లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.