క్రిష్ – పవన్ కాంబో.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

టాలెంటెడ్ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక పిటియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడు లేని విధంగా పవన్ ఫస్ట్ టైమ్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేయగా మిగతా షెడ్యూల్స్ ని కరోనా అదుపులోకి వచ్చిన తరువాత స్టార్ట్ చేయనున్నారట.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమా షూటింగ్ కోసం వర్కింగ్ టైటిల్ గా విరూపాక్ష అని అనుకున్నప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో అదే టైటిల్ అని ఫిక్స్ అవ్వలేదు. ఇక సినిమాలో రాబిన్ హుడ్ స్టైల్లో ధనవంతుల నుంచి దోచుకున్న డబ్బును పేదలకు పంచే వీరుడిగా పవన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ క్యారెక్టర్ కి ‘వీర’ అని పేరు పెట్టారట.

దర్శకుడు క్రిష్ తన సినిమాల విషయంలో మెయిన్ గా టైటిల్ తోనే జనాలను ఎక్కువగా ఆలోచింపజేస్తాడు. ఇక అదే తరహాలో ఉండాలని పవన్ కళ్యాణ్ సినిమా కోసం కూడా పలు రకాల టైటిల్స్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బందిపోటు అనే టైటిల్ సెట్ చేసినట్లు రూమర్స్ వస్తున్నప్పటికీ ఇంకా అదికూడా ఫైనల్ కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2న ఈ సినిమా టైటిల్ పై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.