RRR: ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ ఫస్ట్ లుక్ డేట్ లీక్

RRR Movie

ఇండియన్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్న రాజమౌళి RRR స్టార్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాల డోస్ ని మరింత పెంచగా ఇక జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం RRR ఫస్ట్ లుక్ ఆగస్టు 14వ తేదీన సాయత్రం 4.50కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. మరి ఆ ఫస్ట్ టీజర్ ఏ స్థాయిలో రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.