ప్రభు దేవా VS పవన్ కళ్యాణ్

మే 1న రెండు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ప్రభు దేవా కథానాయకుడుగా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ కొట్టిన సినిమా ప్రేమికుడు. అయితే ఈ సినిమాను మే 1న రీ రిలీజ్ చేస్తుండగా అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రీ రిలీజ్ చేయడం విశేషం. ఈ ఎన్నికల వేడిలో వాకీల్ సాబ్ సినిమా కానీ, ఆ సినిమాలోని డైలాగ్స్ కానీ పవన్ కళ్యాణ్ కు ఉపయోగపడే అవకాశాలు బాగానే ఉండటంతో ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే అదే రోజు మరో సినిమా అయినా ప్రేమికుడు కూడా రీ రిలీజ్ ఉండటం ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ లో కలెక్షన్ల పరంగా పోటీ పడవచ్చు. అయితే కలెక్షన్ ల కోసం కాకపోయినా సినిమా ప్రేమికుల కోసం ఈ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్లు చూస్తే ఓ రెండు అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులు మరోసారి థియేటర్లో చూసి ఎంజాయ్ చెసే అవకాశం రావడం ఆనందం అనే చెప్పుకోవచ్చు.