‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్’లో సెలెక్ట్ అయిన “మా ఊరి పొలిమేర 2”

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫిలిం సిరీస్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మా ఊరి పొలిమేర. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2023 నవంబర్ 3న  ప్రేక్షకుల ముందుకొచ్చిన మా ఊరి పొలిమేర 2 సస్పెన్స్  థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడీ సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024లో మా ఊరి పొలిమేర 2 అఫీషియల్ సెలక్షన్ అయ్యింది. రేపు ఢిల్లీలో ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమాను గౌరు గ‌ణ‌బాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించడమే కాదు ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది.