మెట్రో క్రియేషన్స్ బ్యానర్ పై అమీర్ సమర్పణలో “వదలను” చిత్రం ఓటిటి ద్వారా విడుదల!

మెట్రో క్రియేషన్స్ బ్యానర్ పై అమీర్ సమర్పణలో భాను చందర్ ప్రధానపాత్రలో జంగాల నాగబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వదలను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కావాల్సింది కానీ ప్రస్తుతం ఉన్న కరోన కారణంగా థియేటర్స్ మూత పడ్డాయి, అందువల్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మహమ్మద్ ఖలీల్ నిర్మించారు. సినిమా రష్ చూసి ఓటిటి సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ తెలుపనున్నారు.

నటీనటులు:
భాను చందర్, జీవ, వేణు గోపాల్, కవిత, అదిరే అభి, జబర్దస్త్ ఫణి, రఘు, రేణుక

సాంకేతిక నిపుణులు:
చిత్రం: వదలను
బ్యానర్: మెట్రో క్రియేషన్స్
సమర్పణ: అమీర్
కెమెరామెన్: వాసిరెడ్డి సత్యానంద్
ఎడిటింగ్: మహేంద్రనాథ్
మ్యూజిక్: సంతోష్ రెడ్డి
నిర్మాత: మహమ్మద్ ఖలీల్
కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: జంగాల నాగబాబు.