పవర్ స్టార్ చేసిన పొరపాటే మెగాస్టార్ కూడా..?

రీమేక్ సినిమాలు చేయడం అంటే ఓ వర్గం హీరోలకు రిస్క్ లేని పని. సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని ధైర్యంగా ముందుడగు వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో డబ్బింగ్ అయిన సినిమా కథలను కూడా రీమేక్ చేస్తుండడం అభిమానులలో కొంత ఆందోళన కలిగిస్తోంది.

మెగాస్టార్ ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ పై కూడా విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటే మెగాస్టార్ రిపీట్ చేస్తున్నట్లుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా అజిత్ వీరమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఆ సినిమాను విరుడొక్కడే టైటిల్ తో తెలుగులో డబ్ చేశారు.

దీంతో పవన్ సినిమా రిజల్ట్ లో తేడా వచ్చేసింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఇప్పటికే చాలా మంది చూశారు. అయినప్పటికీ మెగాస్టార్ సుజిత్ తో సరికొత్తగా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.