తాప్సి బి గ్రేడ్ హీరోయిన్.. కంగనా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ లో ఈ మధ్య కంగనా రనౌత్ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను బయటపెడుతున్న కంగనా రనౌత్ తాప్సిపై కూడా అదే తరహాలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది.

తాప్సి ఒక బి గ్రేడ్ యాక్టర్.. ఆమె బాలీవుడ్ మాఫీయాకు కరణ్ జోహార్ వంటి వాళ్లకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటుంది అంటూ కంగనా కామెంట్స్ చేయగా తాప్సి కూడా అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. 10, 12 తరగతుల్లోనే గ్రేడ్స్ ఇస్తున్నారు అనుకుంటే.. ఇప్పుడు ఇలా కూడా ఇస్తున్నారా అని తాప్సి సెటైర్ వేసింది. అదే విధంగా తాను ఎప్పుడు కూడా కరణ్ జోహార్ వంటి వారికి సపోర్ట్ చేయలేదని అయినా అలాంటి వారిని తిట్టాల్సిన అవసరం కూడా తనకు ఏ మాత్రం లేదని తాప్సి వివరణ ఇచ్చింది.