“ఓదెల 2” నుండి తమన్నాని పరిచయం చేస్తూ

అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది సృష్టించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. ఈ సినిమాలో లీడ్ రోల్ హేబాబ్ పటేల్ నటించగా చాలా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు అదే తరహాలో రాబోతుంది ఓదెల 2. ఈ సినిమాలో లీడ్ రోల్ గా తమన్నా భాటియా చేస్తుండగా హేబాబ్ పటేల్ ఇంకా వసిష్ఠ ఎన్ సింహ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సౌందరరాజన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మధు ప్రొడ్యూసర్ గా మధు క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా నుండి ఓ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ వీడియోలో చూడటానికి మేకింగ్ విదేవులా ఉండగా తమన్నా కు మాక్ అప్ వేయడం ఇంకా తమన్నా ను కాస్ట్యూమ్ డిజైన్ చేయడం చుపించ్చరు. ఈ వీడియో ద్వారా తమన్నా ను శివ శక్తి గా పరిచయం చేసారు. అదే విధంగా ఓదెల 2 సినిమా రెండవ షెడ్యూల్ మొదలైనట్లు ఈ వీడియో చివరిలో చూపించారు మేకర్స్.

ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే.