‘తండేల్’ డిజిటల్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి సొంతం చేసుకుంది ఎవరు?

కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తరువాత చందూ మొండేటి దర్శకత్వం చేస్తున్న సినిమా తండేల్. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ న్యూస్ బయట బాగా వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 40 కోట్లకు నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది అని, అలాగే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ సినిమా గ్లింప్సె ఒంక వర్కింగ్ స్టిల్స్ మంచి బజ్ తెప్పించాయి. ఈ సినిమాలో నాగ చైతన్య ఓ మసత్యకారునిగా నటించనున్న విషయం తెలిసిందే. అయితే చైతన్య కారియర్ లోనే ఇది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో చైతన్యను మంచి దేశ భక్తుడిగా చూపించనున్నారు చందూ మొండేటి. కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.