‘పుష్ప-2’ నుండి శ్రీవల్లి గా రష్మిక మందన్న – పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన సినిమా టీం

పుష్ప-1 ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు మన దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాస్ వచ్చింది. అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ట్ చేసిన ఈ సినిమా దర్శకులు సుకుమార్. అయితే గతంలో అల్లు అర్జున్ & సుకుమార్ కలిసి తీసిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

పుష్ప విషయానికి వస్తే ఈ సినిమాను రెండు విభాగాలుగా ప్లాన్ చేసారు సుకుమార్. అందులో మొదటిది పుష్ప ద రిసె అయితే రెండవది పుష్ప ద రుక్. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న తో పాటుగా సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫస్సల్ తదితరులు నటించారు.

అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ చుసిన రష్మిక అభిమానులే కాక సినిమా అభిమానులు ఆనందించారు. అయితే పుష్ప-2 నుండి ఇటీవలే వచ్చిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజున టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది, అలాగే ఆగష్టు 15న పుష్ప-2 ద రూల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.