సూపర్ గుడ్ ఫిల్మ్స్ ‘భవనమ్’ ఫస్ట్ లుక్ – టీజర్ విడుదల

అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

తాజాగా ‘భవనమ్’ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి, అజయ్ ఇలా ప్రధాన తారాగణం అంతా  స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చూస్తుండటం, బ్యాక్ డ్రాప్ లో పెద్ద ‘భవనమ్’ కనిపించడం ఆసక్తికరంగా వుంది. .  

‘ది హాంటెడ్ హౌస్‌’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రం టీజర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ తో పాటు హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఎక్సయిటింగ్ కంటెంట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది

సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి..  పాత్రలన్నీ హిలేరియస్ గా వుంటూనే థ్రిల్ ని పంచాయి. నేపధ్యం సంగీతం బ్రిలియంట్ గా వుంది. హారర్ ని ఎలివేట్ చేసింది.  విజువల్స్, నిర్మాణం విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్, టెర్రిఫిక్ టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి.

ఈ చిత్రంలో గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. మురళీమోహన్ రెడ్డి ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా వరతై ఆంటోని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

సమ్మర్ స్పెషల్ గా మే లో ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల కానుంది.  

తారాగణం: సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, అజయ్ , ప్రభాకర్ (బాహుబలి), గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ , మాళవిక సతీషన్ , స్నేహ ఉల్లాల్ , స్నిగ్దా, మణిచందన, క్రాంతి, హాన్విక, హారిక

సమర్పణ: సూపర్ గుడ్ ఫిల్మ్స్ PVT LTD
నిర్మాతలు : ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి
రచన, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల
డిఓపి : మురళీమోహన్ రెడ్డి ఎస్
సంగీతం: చరణ్ అర్జున్
ఎడిటర్: ఎన్టీఆర్
ఆర్ట్: వరతై ఆంటోని
స్టంట్స్ : స్టార్ మల్లి
కొరియోగ్రఫీ: బాలకృష్ణ, శ్యామ్ కుమార్
ఆర్ఆర్: DSR
డైలాగ్స్: బాలాచారి కూరెళ్ల
పీఆర్వో: వంశీ- శేఖర్