అన్నగారికి భారతరత్న అడిగిన మెగాస్టార్

నందమూరి తారక రామారావు 99వ జయంతి సంధర్భంగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు అన్నగారిని స్మరిస్తూ ట్వీట్స్ అండ్ పోస్ట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్వీట్ చేశాడు. RememberingTheLegend అంటే ట్యాగ్ లైన్ తో ట్వీట్ చేసిన చిరు ఎన్టీఆర్ కి భారత రత్న పురస్కారం లభిస్తే అది తెలుగు వారికి దక్కిన గౌరవం అని చెప్పారు. ట్విట్టర్ లో మ్యాటర్ మాత్రమే పోస్ట్ చేసిన చిరంజీవి ఇన్స్టాలో ఎన్టీఆర్ తో ఉన్న ఫోటో కూడా షేర్ చేశారు. మెగాస్టార్ కోరుకున్నట్లు ఎన్టీఆర్ కి ఏరోజుకి అయినా భారతరత్న పురస్కారం లభిస్తే అదే ఆయనకి మనం ఇచ్చే గొప్ప నివాళి అవుతుంది.