‘బింబిసార’గా కళ్యాణ్ రామ్.. ఊహించని అరాచకం

రిజల్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేసే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కొత్త కథలకి ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా రిలీజ్ చేశారు. టైటిల్‌ అండ్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి కళ్యాణ్ రామ్ అందరికీ షాక్ ఇచ్చాడు. తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు, బింబిసార అనే టైటిల్ తో పేరుతో బయటకి రానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ సూపర్ గా ఉంది. బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ మేకోవర్ చాలా కొత్తగా ఉంది. సోషియో ఫాంటసీ మూవీ అవ్వడం, హ్యుజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉండడం, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. అయితే ఈ బింబిసార పూర్తి స్థాయి ఫాంటసీ మూవీనా లేక మగధీర లాగా సెమీ పీరియాడికల్ డ్రామానా అనేది చూడాలి.

వశిష్ట్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది? ఎప్పుడు షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది? ఎంత ఖర్చు పెడుతున్నారు? లాంటి విషయాలని కళ్యాణ్ రామ్ బయటకి తెలియనివ్వలేదు. ముందెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్న కళ్యాణ్ రామ్, లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్ తో లుక్స్ పరంగా మెప్పించాడు. చిరంతన్ భట్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది, మోషన్ పోస్టర్ లో యూస్ చేసిన గ్రాఫిక్స్ లో కూడా క్వాలిటీ ఉంది. ఇదే క్వాలిటీకి కంటెంట్ కూడా యాడ్ అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడినట్లే.