గుడిలో గోల్మాల్ చేసే దొంగల పని పట్టనున్న మెగాస్టార్

రీఎంట్రీ తర్వాత చేసిన ఖైదీ నంబర్ 150, సైరా సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ని తిరగరాస్తున్నాడు. ముఖ్యంగా సైరా సినిమా జైత్రయాత్ర బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతూనే ఉంది. ఈ జోష్ తగ్గే లోపే కొరటాల శివతో 152వ సినిమా అనౌన్స్ చేసిన చిరు, రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో మొదలుపెట్టనున్నాడు. రీసెంట్ గా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చిరంజీవి దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్ కథలకి, కమర్షియల్ హంగులు అద్దడంలో దిట్ట అయిన కొరటాల శివ, చిరుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిగా చూపించబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుత సమాజంలో దేవుళ్ల గుడుల్లో జరిగే అవినీతి అక్రమాల అన్యాయాల గురించి చూపిస్తూ చిరుని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. లైన్ వినడానికి చాలా బాగుంది కాబట్టి దానికి శివ మార్క్ అండ్ చిరు మ్యాజిక్ కలిస్తే 152 సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవడం ఖాయం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.