పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో రేపు వరుణ్ తేజ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో రాజకీయ పార్టీలు పోత పోటీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే రాజకీయ ప్రచారంలో సినిమా వాళ్ళు ప్రచార భాగం కావడం కొత్త ఎం కాదు. పైగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఈసారి సినీ నటుల ప్రచారం కాస్త ఎక్కువగానే ఉంది.

అయితే రేపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. తన బాబాయ్ అయినా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో ప్రచారం కోసం సిద్ధం అయ్యారు వరుణ్ తేజ్. జనసేన, తెలుగు దేశం, బీజేపీ పార్టీల కూటమికి సపోర్ట్ చేస్తూ వరుణ్ తేజ్ పిఠాపురం నియోజక వర్గంలో తన బాబాయ్ అయినా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వోట్ వేసి గెలిపించమని ప్రచారం చేయనున్నారు వరుణ్ తేజ్.