‘భలే ఉన్నాడే’ టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ మారుతి

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. 

చీర కట్టే వృత్తిని ఎంచుకున్న రాధగా రాజ్ తరుణ్ పాత్రను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. బైక్‌పై అబ్బాయిలా కూర్చోవడాన్ని కూడా ఇష్టపడడు. అయితే, మనీషా కంద్కూర్ అతనిని ఇష్టపడుతుంది. తనతో ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథలో కీలకాంశం.

జె శివసాయి వర్ధన్ ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, రాజ్ తరుణ్‌ని హిలేరియస్ పాత్రలో ప్రజెంట్ చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు రాజ్ ని అభినందించాలి. అతని కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంది. మనీషా కంద్కూర్ కూడా తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ స్నేహితుడిగా హైపర్ ఆది కనిపించాడు. ఇతర ప్రముఖ హాస్యనటుల ప్రజెన్స్ చూస్తుంటే ఈ చిత్రంలో ఎంటర్ టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది.   

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను చాలా బాగా డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. నిర్మాత కిరణ్ గారు కూడా కథ నచ్చి ప్రాజెక్ట్ లో వచ్చారు. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే ఫిల్మ్ అని భావిస్తున్నాను. ఇది మన మధ్యలో జరిగే ఒక కథలా వుంటుంది. మనిషా చాలా చక్కగా నటించింది. శివసాయి చాలా పాషన్ వున్న దర్శకుడు. ప్రతి విషయంలో చాలా క్లియర్ గా పెర్ఫెక్ట్ గా వుంటాడు. శేఖర్ చంద్ర మంచి పాటలు ఇచ్చారు. ఇద్దరు డీవోపీలు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. దాదాపు ఇండస్ట్రీలో వున్న ఆర్టిస్ట్ లందరూ వున్నారు. తమిళ్ నుంచి కూడా వీటీ గణేషన్ లాంటి నటులు తీసుకొచ్చారు. మంచి కంటెంట్ తో రాబోతుంది ఈ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా అవ్వబోతుంది. రెండు రీళ్ళు చూశాను. ఫ్లో చాలా బావుంది. పరిశ్రమలో కి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ నిర్మాతలకు స్వాగతం. చిన్న సినిమాలు ఎప్పటికీ బావుండాలి. నేను ఎంత పెద్ద సినిమాలు చేస్తున్నా .. చిన్నసినిమాతోనే వచ్చాను కాబట్టి ఆ సినిమాలు వదలకుండా ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమా కూడా బాగా ఆడితే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఈటీవీ విన్, ఆదిత్య మ్యూజిక్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ తెలిపారు 

డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ.. మేమంతా మారుతి గారి టీం నుంచి వచ్చాం. ఈ కథ గురించి నాకు తెలుసు. కిరణ్ గారు ఖర్చుకి వెనకాడకుండా చాలా గ్రాండ్ గా తీశారు. సినిమా చాలా రిచ్ గా వుంటుంది. రాజ్ తరుణ్ చాలా కొత్త పాత్రలో అలరిస్తాడు. టీజర్ చాలా బావుంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్” అన్నారు. 

డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. టైటిల్ చూస్తుంటే భలే భలే మగాడివో వైబ్ కనిపిస్తుంది. రాజ్ తరుణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మారుతి టీం ప్రోడక్ట్ ఒక బ్రాండ్. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖచ్చితంగా గొప్పగా అలరిస్తుంది. సినిమా పెద్ద హిట్ కావాలి. అవుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. 

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో షాకింగ్ కామెడీ వుంటుంది. చాలా కొత్తగా ఉండబోతుంది. కంటెంట్ తో వుండే సాంగ్స్ వున్నాయి. చాలా కొత్తగా ప్రయత్నించాం. దర్శకుడు శివగారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. రాజ్ తరుణ్ తో ఇది నా మూడో సినిమా. తప్పకుండా ఈ సినిమా అందరినీ నచ్చుతుంది’ అన్నారు. 

నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన మారుతి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బావొచ్చింది. దర్శకుడు అద్భుతంగా తీశారు. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

చిత్ర దర్శకుడు జె శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాకి ఆద్యుడు మారుతి గారు. ఈ సినిమాకి ఆయన హార్ట్. ఆయనకి ధన్యవాదాలు. ఆయన వలనే నా కల నెరవేరింది. నిర్మాత కిరణ్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మిన రాజ్ తరుణ్ గారికి ధన్యవాదాలు. శేఖర్ చంద్రగారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నగేష్ బానెల్లా వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు 

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. శేఖర్ చంద్ర చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మరో రెండు సినిమాలకి కూడా తనతో అగ్రీమెంట్ రాయించుకున్నా.(నవ్వుతూ) డీవోపీ నగేష్ బానెల్లాతో ఇది నా మూడో సినిమా. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటే ఇప్పటికి కుదిరింది. అది ఈ సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. నన్ను ఇంతగా నమ్మిన ఆయనకి ధన్యవాదాలు. దర్శకుడు శివసాయి నేను పని చేసిన దర్శకుల్లో ఒక బెస్ట్ డైరెక్టర్. తనతో మళ్ళీ కలసి పని చేయాలని వుంది. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి’ అన్నారు. 

తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: జె శివసాయి వర్ధన్

ప్రెజెంట్స్: మారుతీ టీమ్

నిర్మాత: N.V కిరణ్ కుమార్

బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్

DOP: నగేష్ బానెల్లా

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

ఆర్ట్: సురేష్ భీమగాని

ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ

పీఆర్వో: వంశీ-శేఖర్