డార్లింగ్ ప్రభాస్ పై సెన్సేషల్ కామెంట్స్ చేసిన రౌడీ హీరో

తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, టెర్మినేటర్ డార్క్ ఫేట్ ట్రైలర్ ని లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా టెర్మినేటర్ గురించి కాసేపు మాట్లాడిన విజయ్ దేవరకొండ, చిన్నప్పుడు తాను ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూసేవాడో చెప్పుకొచ్చాడు. ఇంగ్లీష్ సినిమాలని తెలుగులో డబ్ చేయడమే కాకుండా భారీ బడ్జట్ తో తెరక్కేక్కిన మన సైరా, సాహూ సినిమాలని కూడా హాలీవుడ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు.

vijay devarkonda prabhas

ఇదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ పై హాట్ కామెంట్స్ చేసిన రౌడీ హీరో, ప్రభాస్ టెర్మినేటర్ లాంటి సినిమాలో నటిస్తే చూడాలని ఉందని చెప్పాడు. విజయ్ దేవరకొండ మాటలు విన్న ప్రభాస్ అభిమానులు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలో ప్రభాస్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి, వాటిని దాటి విజయ్ దేవరకొండ ఏకంగా ప్రభాస్ ని ఇంటర్నేషనల్ సినిమాలో చూడాలని ఉందని చెప్పాడు. మరి ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాకుండా వరల్డ్ సినిమా మీద కాన్సెన్ట్రేట్ చేస్తాడేమో చూడాలి.