టర్మినేటర్ అఫీషియల్ తెలుగు ట్రైలర్ లాంచ్ చేసిన రౌడీ

ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు ఉన్న ప్రతి సినీ అభిమానికి తెలిసిన సినిమాల్లో టైటానిక్, ఎంటర్ ది డ్రాగన్, టర్మినేటర్ లు ముఖ్యమైనవి. ఇప్పుడంటే ప్రతి హాలీవుడ్ మూవీ ఇండియాలో రిలీజ్ అవుతుంది కానీ అసలు ఇంగ్లీష్ మూవీస్ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది ఈ సినిమాల కారణంగానే. అంతటి గొప్ప సినిమాల్లో ఒకటైన టర్మినేటర్ సిరీస్ నుంచి కొత్త ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. టెర్మినేటర్ డార్క్ ఫేట్ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఇప్పటికే ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుండగా, తెలుగులో కూడా ట్రైలర్ రిలీజ్ చేయడం సినిమాకి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తెలుగులో మాత్రమే కాకుండా అన్ని రీజినల్ లాంగ్వేజ్స్ లో టెర్మినేటర్ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చాలా రోజుల తర్వాత ఆర్నాల్డ్ మళ్లీ టెర్మినేటర్ గా కంబ్యాక్ ఇవ్వడం, మొదటి రెండు పార్ట్స్ ని నిర్మించిన జేమ్స్ కామెరూనే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేయడంతో టెర్మినేటర్ డార్క్ ఫేట్ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయి.