అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు… ఆపైన తీసేశారు…

నందమూరి నటసింహం బాలకృష్ణ, జై సింహ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టిన ఈ చిత్రాన్ని అభిమానులు #NBK105 అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా సినీ అభిమానులని కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడా అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సన్ నెట్వర్క్ జెమినీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వేసి అందరికీ షాక్ ఇచ్చారు.

NBK105 updates

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ డిసెంబర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసిన జెమినీ టీమ్, దీనితో పాటు టైటిల్ ని కూడా లీక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. NBK105 సినిమాకి ఒక్క ట్వీట్ తో రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని లీక్ చేసిన జెమినీ, కాసేపటి తర్వాత ఆ ట్వీట్ ని మళ్లీ డిలేట్ చేశారు. గత కొంతకాలంగా రూలర్, జడ్జిమెంట్, డిపార్ట్మెంట్ అనే టైటిల్స్ వినిపిస్తున్నా ఏది ఫైనల్ అవుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు అయితే జెమినీ వేసిన ట్వీట్ తో రూలర్ అనేది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.