బిగ్‌బాస్‌లో ఆమె వేస్ట్ కంటెస్టెంట్.. కుమార్ సాయి సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్-4 నుంచి ఎలిమినేట్ అయిన నటుడు కుమార్ సాయి తిరిగి రీఎంట్రీ ఇస్తాడనేది వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తనకు మళ్లీ ఆఫర్ వస్తే ఖచ్చితంగా వెళతానని ఇప్పటికే కుమార్ సాయి చెప్పాడు. కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడంపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కావాలని అతడిని షో నుంచి బయటికి పంపించేశారనే విమర్శలు వచ్చాయి. అయితే మరి కొద్దిరోజుల్లో బిగ్‌బాస్-4 ముగియనుండటంతో కుమార్ సాయి రీఎంట్రీ ఇస్తే షోకు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

కంటెస్టెంట్స్ అందరి గురించే కుమార్ సాయికి తెలుసు కాబట్టి మళ్లీ వెళితే బలంగా ఆడే అవకాశముంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో గురించి కుమార్ సాయి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. మెనాల్‌కి బదులుగా తనను ఎలిమినేట్ చేశారని, మోనాల్ కంటే తాను చాలా బెటరని కుమార్ సాయి చెప్పాడు. మోనాల్ అసలు వేస్ట్ కంటెస్టెంట్ అని చెప్పాడు. తాను మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని చెప్పాడు.

బిగ్‌బాస్ షోలో ప్లాన్ ప్రకారం ఉంటారని, తనకు అలాంటివి ఏమీ ఉండవని కుమార్ సాయి చెప్పాడు. తాను బయట ఏ విధంగా ఉంటానో. బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉన్నానన్నాడు.