అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో భారీ మల్టీస్టారర్

అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించిన ‘మనం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ‘మనం’ సినిమా టాలీవుడ్‌లోనే బెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు చివరిగా నటించిన సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ సినిమా రాబోతోందట. నాగార్జున, అఖిల్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి చర్చలు జరుపుతున్నాడట. దీంతో పాటు మన్మథుడు 2 డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా అక్కినేని ఫ్యామిలీతో మల్టీస్టారర్ సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్.

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తుండగా.. నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాను కంప్లీట్ చేసుకున్నాడు. అటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరి ఈ ముగ్గురు కలిసి మరో సినిమా చేస్తే అది ప్రేక్షకులకు మరింత వినోదాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు.