బిగ్‌బాస్ ‘జలజ’ ఆమేనట?

బిగ్‌బాస్‌లో దెయ్యం ‘జలజ’ వాయిస్ ఎవరిది అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గీతామాధురి, హరితేజది అంటూ ప్రచారం జరిగింది. కానీ వాళ్లు మాత్రం ఆ దెయ్యం వాయిస్ తమది కాదంటూ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అవినాష్ అయితే ఆర్జే సునీత వాయిస్ అని చెప్పాడు.

bigboss jalaga

అయితే ఆ వాయిస్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణిది అని కొంతమంది చెబుతుండగా.. మరికొందరు మాత్రం స్వాతి దీక్షిత్‌ది అని చెబుతున్నారు. ఇక అరియానా భయపడిన సమయంలో అద్దంలో కనిపించింది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ భానుశ్రీ అని చెబుతున్నారు. భాను వాయిస్ చాలా విభిన్నంగా ఉంటుంది. దీంతో ఆమె గొంతు మార్చి జలజ మాదిరిగా మాట్లాడుతుందని అంటున్నాడు.

కంటెస్టెంట్స్‌ను టాస్కులు ఇస్తూ జలజ భయపెడుతోంది. అరియానా ఎక్కువగా భయపడుతుండగా.. మిగతా కంటెస్టెంట్స్ అంతగా భయపడటం లేదు. దీంతో ఈ జలజ వాయిస్ ఎవరిది అనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.