డిసెంబర్ 11 నుంచి థియేటర్లు ఓపెన్

ఏపీలో డిసెంబర్ 11 నుంచి థియేటర్లు ఓపెన్ చేసేందుకు థియేటర్ల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల రద్దు, ఆస్తిపన్ను తగ్గింపు, 75 శాతం ఆక్యూపెన్సీకి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తే డిసెంబర్ 11 నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోతే సంక్రాంతికి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల ధియేటర్లు మూతపడటంతో యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, ఆస్తి పన్ను తగ్గించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.

cinem theaters

అలాగే 50 శాతం అక్యూపెన్సీతో థియేటర్లు నడపాలంటే కష్టమని, 75 శాతం ఆక్యూపెన్సీతో అవకాశం ఇస్తే వెసులుబాటు ఉంటుందని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. తరచూ శానిటైజ్ చేయడం, సీటింగ్ అరెంజ్మెంట్ ఖచ్చితంగా చేయాలంటే ఒక్కొక్క థియేటర్‌కు రూ.4 నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత భరించడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేస్తే ప్రేక్షకులు వస్తారనే నమ్మకం కూడా లేదు. దీంతో ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తే డిసెంబర్ 11 నుంచి ఓపెన్ చేయనున్నారు.