24క్రాఫ్ట్స్ కాదు..ఇక నుంచి 25 క్రాఫ్ట్స్

కరోనా వైరస్ రాకముందు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ సబ్యులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సినిమా కోసం కలిసి కట్టుగా పనిచేసేవారు. అయితే ఇక నుంచి 25క్రాఫ్ట్స్ సభ్యులు కనిపించబోతున్నారు. నటీనటుల నుంచి లైట్ బాయ్ వరకు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పని చేస్తేనే సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

అయితే ఇప్పుడు కరోనా వల్ల 24 క్రాఫ్ట్స్ కోసం అదనంగా మరొక క్రాఫ్ట్ చేరింది. అదే కోవిడ్ ప్రొటెక్షన్ క్రాఫ్ట్. కరోనా వల్ల షూటింగ్స్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ ఇప్పుడు వైరస్ భారిన పడకుండా కొత్త క్రాఫ్ట్ ని సెట్ చేసుకుంది. ఎవరు కూడా వైరస్ భారిన పడకుండ ఉండడానికి ఈ విభాగం సభ్యులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.

షూటింగ్ లో ప్రతి చిన్న వస్తువును శానిటైజేషన్ చేసి కెమెరాలను అలాగే కాస్ట్యూమ్స్ కూడా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గ దర్శకుల ఆధారంగా ఈ విభాగం పని చేయనుంది.