సాయి పల్లవి సినిమాలు ఇక లేనట్లే..

sai pallavi

అంటే పూర్తిగా కాదులేంటి. కేవలం ఈ ఏడాది మాత్రమే.. సాయి పల్లవి వెండితెరపై కనిపించదు. ఎందుకంటే ఇప్పటికే విరటపర్వం సినిమా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. ఇక నాగ చైతన్యతో నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా కూడా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ పనులు ఇంకా కొంత ఫినిష్ చేయాల్సి ఉంది.

పరిస్థితులను చూస్తుంటే షూటింగ్స్ పూర్తయినా కూడా థియేట్రికల్ రిలీజ్ అనేది జరగని పని కాబట్టి వచ్చే ఏడాది రిలీజ్ డేట్ సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అందువల్ల సాయి పల్లవి ఈ ఏడాది వెండితెరకి దూరంగానే ఉండనుంది. ఇక ఆమె సక్సెస్ చూసి కూడా చాలా కాలమవుతోంది. గత ఏడాది ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. భారీ స్థాయిలో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ సినిమా NGK కూడా పెద్దగా ఆకట్టుకోలేకయింది. మరి నెక్స్ట్ సినిమాలతో ఫిదా బ్యూటీ ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి.