బిగ్‌బాస్ విన్నర్ అతడే

బిగ్‌బాస్-4 మరో రెండు వారాల్లో ముగియనుంది. దీంతో బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అవుతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అభిజిత్, అనినాష్, అఖిల్, సోహెల్, మోనాల్, అరియానా, హారికలు ఉన్నారు. వీరిలో ఈ వారం మోనాల్ లేదా అరియానా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే ఇక హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉంటారు.

bigboss 4

అయితే ఈ సారి అభిజిత్ విన్నర్ అవుతాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే 12 వారాలు ఎలిమినేషన్ నుంచి అభిజిత్ సేవ్ అయ్యాడు. ప్రేక్షకులు ప్రతివారం అతడికి భారీగా ఓట్లు వేస్తున్నారు. దీంతో ఈ సారి విన్నర్ అభిజిత్ కన్ఫామ్ అని చెబుతున్నారు. ఇక రన్నర్‌గా ఎవరు నిలుస్తారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.

అఖిల్, సోహైల్, అనినాష్‌లలో ఒకరు రన్నర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, మోనాల్ తప్పిస్తే మిగతావారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. దీంతో ఫైనల్ పోరు రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.