పద్మ విభూషణ్ చిరంజీవి గారికి పుష్ప శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు వారికే కాదు, దేశం అంతటా తెలిసిన పేరు. 150 కు పైగా చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అటు కథానాయకుడుగానే కాకుండా తన తొలి చిత్రాలలో ప్రతి నాయకుడుడిగా కూడా ఆయన నటించారు. తన స్టైల్ ఇంకా తన నటనతో అందరిని మెప్పించారు. సుమారు 3 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర స్థానంలో నిలిచారు.

అయితే ఇటీవలే పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించగా, చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ప్రకటించిన విష్యం అందరికి తెలిసిందే. కాగా నిన్న ఢిల్లీ లో చిరంజీవికి దేశ ప్రెసిడెంట్ అయినా ద్రౌపది చేతుల మీదగా అందుకున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి తన సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కాగా తన సినిమా అయినా పుష్ప 2 ఆగష్టు 15న విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.